2, సెప్టెంబర్ 2010, గురువారం

Its an experiece of a Journalist

వైయస్సార మరణవార్త రాష్ట్రం మొత్తాన్ని చలించివేసింది. అపర భగీరథుడు, డాక్టర్ గా సార్థకనామధేయుడు అని అభిమానులు పిలుచుకునే వైయస్సార్ మృతి రాష్ట్రానికి తీరనిలోటు. వైయస్సార్ శతృవులు కూడా... ఈ ఘటనతో ఉద్వేగానికి లోనయ్యారు. వైయస్ ను రోజూ తిట్టే చంద్రబాబు కూడా.. చాలాకాలం రాజశేఖరుడి గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. (అఫ్‌కోర్స్.. చచ్చిన వాళ్ళను తిడితే దెయ్యమై పడతారనే భయం కూడా ఉండి ఉండొచ్చు). ఈ మహానుభావుడు మరణించి ఏడాది పూర్తైనా... ఆ దృశ్యం తలచుకుంటేనే భయమేస్తోంది. ఆర్థికంగా వెనకబడ్డ విద్యార్థులకు ఫీజులు లేకుండానే ఉన్నతవిద్యనభ్యసించే అవకాశం కల్పించిన గొప్పమనిషి.

ఈ సంగతి పక్కన పెడితే.. hmtv రీజనల్ డెస్క్ ఇంఛార్జ్ విజయ్ కుమార్ గారు, ఈ మహానేత మరణాన్ని ప్రపంచానికి అందించిన వ్యక్తి. వైయస్ మృతదేహాన్ని తొలిసారి చూసిన జర్నలిస్టూ... ఈయనే. పావురాల గుట్ట వద్ద ఎక్స్‌క్లూజివ్ గా hmtv అందించిన కథనానికి మూలపురుషుడు. వైయస్ ఛాపర్ మిస్సింగ్ నుంచి డెడ్ బాడీ హైదరాబాద్ చేరేంతవరకు ఆయన పడ్డ కష్టాలు, బాధలు, ఆవేదనను ఆయన బ్లాగ్ లో పెట్టారు. ఆయన అనుమతిలేకుండానే ఈ కథనాన్ని కాపీచేస్తున్నాను. (తర్వాత అనుమతి తీసుకుంటాను) మీరూ చదవండి.. ఆయన అనుభవాలు, యువ జర్నలిస్టులకు ఉపయోగపడతాయని... కాదు ఉపయోగపడాలని నా అభిలాష..
(http://journomucchatlu.blogspot.com/)

30, మే 2010, ఆదివారం

అమ్మమ్మ....

త్వరలో మరిన్నివివరాలు.....
అందరి జీవితాల్లో తప్పక జరిగే సంఘటనలతో.....